జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ శివారులోని మోజ్మాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దూదూ సమీపంలో ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ల ట్రక్కును మరో లారీ ఢీకొట్టింది. గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలిపోయాయి. గ్యాస్ సిలిండర్లు పేలడంతో రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రోడ్డుపై ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. దీంతో జైపూర్-ఆజ్మీర్ జాతీయ రహదారిని పోలీసులు మూసివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సిలిండర్ల పేలుతుండడంతో దగ్గరికి వెళ్లడానికి ఫైర్ సిబ్బంది సహసం చేయడంలేదు.