హిమాచల్‌ప్రదేశ్ లోని బిలాస్‌పూర్ జిల్లా లో మంగళవారం సాయంత్రం 6.25 గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్ టూరిస్టు బస్సుపై కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. జిల్లా లోని భార్తీ సమీపంలో బలుఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చె ప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. బిలాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ ఈ ప్ర మాదం వివరాలు తెలియజేస్తూ ముగ్గురిని మా త్రం సజీవంగా బయటకు తీయగలిగామని తెలిపారు. హర్యానా లోని రోహ్‌తక్ నుంచి హిమాచల్ లోని ఘుమర్విన్‌కు ప్రైవేట్ బస్సు బయలుదేరింది.ఝండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్ ప్రాంతానికి చేరుకోగానే కొండచరియలు విరిగి బస్సుపై పడ్డాయి. బస్సు మొత్తం శిథిలాల కింద చిక్కుకు పోయింది.
ఈ బస్సులో 30 మందికి పైగా ఉన్న ట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీయడానికి పోలీస్, ఫైర్‌డిపార్టుమెం ట్, వైపరీత్య నివారణ విభాగం సిబ్బంది రిస్కు ఆపరేషన్ చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికపై సహా య చర్యలు జరుగుతున్నాయి.ప్రమాదం జరిగిన వెంటనే చు ట్టుపక్కల నుంచి భారీ సంఖ్యలో జనం వచ్చి గు మిగూడారు. అప్పటికే సహాయ చర్యల కోసం జె సిబియంత్రాలు శిథిలాలను తొలగించడం ప్రా రంభించాయి. అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం ఇప్పటివరకు 18 మంది మరణించారని అధికారులు చె ప్పారు. ముఖ్యమంత్రి ఠాకూ ర్ సుఖ్‌విందర్‌సింగ్ సుఖు ఈ ప్రమాదంపై ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.మోడీ ఈ ప్రమాదంలో మృ తులైన వారి కుటుంబీకులకు తీవ్ర సంతా పం వె లిబుచ్చారు. రూ. 2 లక్షల వంతున సహా యం ప్రకటించారు. ప్రధాని పునరావాస నిధి కింద ఈ సహాయం అందుతుందని తెలిపారు. గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున సహాయం ప్రకటించారు.