మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మంగళవారం ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ‘గౌరవనీయులైన మాజీ ప్రధాని హెచ్. డి.దేవెగౌడ్ ఇన్ఫెక్షన్‌తో ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్య నిర్వహణ జరుగుతోంది. వైద్య నిపుణుల బృందం ఆయన పురోగతిని పర్యవేక్షిస్తోంది’ అని మణిపాల్ హాస్పిటల్ తన బులెటిన్‌లో పేర్కొంది. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం జెడి(ఎస్) అధినేత దేవెగౌడ జర్వంతో ఆసుపత్రిలో చేరారు.