మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. శోభన అద్భుత బ్యాటింగ్‌తో బంగ్లానే ఆదుకుంది. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన శోభన 8 పరుగులు సాధించింది. చివర్లో రాబియా ఖాన్ 27 బంతుల్లోనే అజేయంగా 43 పరుగులుచేసి తనవంతు పాత్ర పోషించింది. మిగతా వారిలో షమీమ్ అక్తర్ (30), శోమ అక్తర్ (10) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ఇంగ్లీష్ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ మూడు, స్మిత్, చార్లి, కాప్సె రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. హీథర్ నైట్ 79 (నాటౌట్) చిరస్మరణీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించింది.