యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు బొలెరో వాహనాన్నీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్నేహితుడి కారులో విజయ్ అక్కడి నుండి హైదరాబాద్ తిరిగివచ్చాడు. విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని విజయ్ దర్శించుకున్నాడు. హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. మేమంతా క్షేమం… తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు.
ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని అభిమానులకు సూచిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. అంతేకాకుండా వర్కవుట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చినట్లు కూడా చెప్పుకొచ్చాడు. అయితే కొంచెం తలపై నొప్పిగా ఉంది… కానీ మంచి బిర్యానీ తిని, సుఖంగా నిద్రపోతే అంతా సెట్ అవుతుందని చెప్పాడు. ఇక విజయ్, రష్మిక ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే వాళ్ళు తమ ఎంగేజ్ మెంట్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.