రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో కొన్ని నెలల క్రితం టీం ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మాన్ గిల్.. తాజాగా రోహిత్ నుంచి వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం టి-20లకు వైస్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే పొట్టి ఫార్మాట్‌లో కూడా అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పట్లో అది జరిగే పని కాదని.. టీం ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డారు.
‘‘టెస్ట్ క్రికెట్‌లో గిల్ మంచి ఆటగాడని నేను అనుకుంటున్నాను. వన్డేల్లోనూ అతడి గణంకాలు బాగున్నాయి. కానీ, ఈ స్థాయి ఆటగాడికి మరింత మెరుగైన గణాంకాలు ఉండాలని అనుకుంటున్నా. సెలక్టర్‌లు టి-20లకు కెప్టెన్‌ా శ్రేయస్ అయ్యర్ పేరును పరిశీలిస్తారని భావిస్తున్నా. పొట్టి ఫార్మాట్‌లో గిల్ ఇంకా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేదు. ఆసియా కప్‌లో 2025లో గిల్ బాగా ఆడకపోవడంతో రెండో ఓపెనింగ్ స్లాట్ కోసం సంజు శాంసన్, యశస్వీ జైస్వాల్‌ల మధ్య పోటీ నెలకొంది. గిల్ ఇంకా టి-20 జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఇప్పట్లో అతను కెప్టెన్ అవుతాడని నేను అనుకోవడం లేదు. భారత క్రికెట్‌లో రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోతాయి. నిజాయితీగా చెప్పాలంటే.. చాలా మంది వైస్ కెప్టెన్‌లు కెప్టెన్ కాకపోవడం కూడా చూశాం కదా?’’ అని ఊతప్ప అన్నారు.