ప్రస్తుతం ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమాల హవానే నడుస్తోంది. స్టార్ హీరోలు అందరూ భారీ సినిమాలు చేయడంలో బిజీగా ఉన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒకటి లేదా రెండు అలా చాలా అరుదుగా వస్తున్నాయి. మరోవైపు పలు నిర్మాణ సంస్థలు కంటెంట్ ఉండే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తీసేందుకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. అలాంటి నిర్మాణ సంస్థల్లో వైజయంతి మూవీస్ ఒకటి.
‘మహానటి’, ‘సీతా రామం’, ‘కల్కి’ సినిమాలతో మంచి కామ్‌బ్యాక్ ఇచ్చింది వైజయంతి మూవీస్. ఇప్పుడు ఈ బ్యానర్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ‘చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా’ అనే టైటిల్‌ను వైజయంతి మూవీస్ రిజిస్టర్ చేసిందట. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. తండ్రి, కూతురి మధ్య జరిగే భావోద్వేగ కథ ఇది అని టాక్.
అయితే ఈ సినిమా కోసం కొందరు హీరోయిన్లను పరిశీలిస్తున్నారట. వారిలో శ్రీలీల.. భాగ్యశ్రీ బోర్సే పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కమర్షియల్ సినిమాల్లో వీళ్ల యాక్టింగ్‌పై చిన్నపాటి కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. వీళ్లను మెయిన్ లీడ్‌గా పెట్టి సినిమా చేయడం అంటే కాస్త డిఫరెంట్‌గా ఉంటుందనే చెప్పాలి.