రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో.. స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’. 2022లో విడుదలైన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాను మెచ్చుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి టీం ఇండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ చేరాడు. ఈ సినిమాను మెచ్చుకుంటూ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు.
‘‘కాంతార ఛాప్టర్ 1 చూశాను. మరోసారి రిషబ్ తన ప్రతిభతో మేజిక్ చేశారు. మంగళూరు ప్రజల నమ్మకాన్ని తెరపై అద్భుతంగా చూపించారు’’ అని రాహుల్ రాసుకొచ్చాడు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ కూడా స్పందించింది. ‘‘ఇది చూశాక ఎంతో గర్వంగా ఉంది. ఇది టీమ్ అందరికీ నిజంగా విన్నింగ్ మూమెంట్’’ అని పేర్కొంది. కెఎల్ రాహుల్‌కు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది.