చెన్నై: టివికె పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్ర్భాంతికి గురి చేసింది. తాజాగా విజయ్ మంగళశారం బాధిత కుటుంబాలతో వీడియో కాల్‌లో మాట్లాడారు. త్వరలో కరూర్‌లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
కాగా, ఈ ఘటనపై ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు ప్రామాణిక నిర్వహణ విధా నిబంధనలు రూపొందించే వరకూ హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.