అమరావతి: మందుబాబులకు కూడా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. ఆఫ్రికా ఫార్ములా తెచ్చి ఎపిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని అన్నారు. టిడిపి నేతల మద్యం తయారీపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో టిడిపి నేతలకు నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇస్తున్నారని, నకిలి మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని పేర్ని నాని సూచించారు. డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ను.. ఇక నుంచి ‘ కలుగు నాయుడు’ అని పిలవాలని, ఎన్నికల ముందు బయటకొస్తాడని, ఊగిపోతాడని, జుట్టు పీక్కుంటాడని విమర్శించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే కలుగులో నుంచి బయటకు రాడని పేర్నినాని ఎద్దేవా చేశాడు.