రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు పరిచయం చేసింది. అయితే ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరణంలో.. రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
అయితే ‘బాహుబలి : ది ఎపిక్’ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ వార్త కూడా హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా చివర్లో ‘బాహుబలి-3’ గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని సోషల్‌మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. అదంతా కేవలం రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేశారు. మూడో పార్ట్‌కి చాలా వర్క్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే బాహుబలి 3 ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు. అనుకునంత సమయంలో ఈ సినిమా పూర్తకాకపోవచ్చని పేర్కొన్నారు.