హీరో నాగశౌర్య పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’లో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మేకర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ నాగ శౌర్యను రగ్గడ్ , ఇంటెన్స్ స్టైలిష్ న్యూ అవతార్‌లో చూపించింది. యాక్షన్ సన్నివేశాలు, హై-ఆక్టేన్ మూమెంట్స్ తో మాస్ పాత్రలో పరిచయం చేస్తోంది. ఈ టీజర్‌లో శౌర్యతో పాటు విధి, సముద్రఖని, నరేష్ వికె, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంలో ఇంటెన్స్ డ్రామా, కామెడీ కలగలిసి ఉన్నాయి. దర్శకుడు రామ్ దేసినా అద్భుతమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించారు. బ్యాడ్ బాయ్ కార్తీక్ త్వరలో బిగ్ స్క్రీన్స్‌లోకి రానుంది.