మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాల యానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వర్సిటీ సమీపంలో సిఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద 5 ఆర్‌డిఎక్స్ ఐఈడి బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్ వచ్చింది. దీంతో హెలిప్యాడ్ పరిసరాల్లో బాంబు స్కాడ్, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం సిఎం చంద్రబాబు నారావారాపల్లికి రానున్నారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.