కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో భారీ పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ ఇప్పటికే యూరప్ కూడా చేరుకుంది. హీరోహీరోయిన్లపై రెండు పాటలను కూడా అక్కడే షూట్ చేయనున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ‘రాజా సాబ్‘ ట్రైలర్ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ స్పందన తెచ్చుకుంటోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ట్రైలర్‌లో రెండు డిఫరెంట్ షేడ్స్ లో ప్రభాస్ కనిపించిన తీరు రెబల్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్ని మైమరపించింది. టెర్రఫిక్ రాజా సాబ్ క్యారెక్టర్‌తో పాటు వింటేజ్ లుక్ లో ప్రభాస్ వర్సటైల్ గా కనిపించి ఆకట్టుకున్నారు.
రాజా సాబ్ ట్రైలర్ లో కనిపించిన వరల్డ్ క్లాస్ మేకింగ్, క్వాలిటీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టాండర్డ్‌ను చూపించింది. దర్శకుడు మారుతి తనకు ఇష్టమైన రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో తన ఫేవరేట్ హీరో ప్రభాస్ ను వర్సటైల్ గా చూపించారు. తమన్ బీజీఎంలోని వేరియేషన్స్ రాజా సాబ్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ రాజా సాబ్ కు కావాల్సినంత గ్లామర్ ను జత చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జనవరి 9, 2026న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.