అమరావతి: కల్తీ మద్యం మాఫియాకు మూల విరాట్ మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డే అని టిడిపి ఎమ్మెల్సి పంచుమర్తి అనురాధ తెలిపారు. మహిళల పుస్తెలు తెంచి.. పాపపు సొమ్ము తన ప్యాలెస్ లో దాచారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాటి కుంభకోణాలు, మృతులపై నోరు మెదపలేదని ఆరోపించారు. జగన్ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం ఏదో జరిగిపోతుందని సొంత పత్రికలో రాసుకున్నారని, లిక్కర్ కుంభకోణంలో నిందితులను వదిలే ప్రసక్తి లేదని తెలియజేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన వారిని జగన్ ఏం చేశారు? అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్ లో మద్యం తాగి 6 మంది చనిపోతే ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు కల్తీ మద్యంతో దొరికిన వారంతా వైసిపి మూలాలున్న వారే అని పంచుమర్తి అనురాధ విమర్శించారు.