ఢిల్లీ: సుప్రీంకోర్టులో కలకలం సృష్టించింది. సిజెఐ బిఆర్ గవాయ్‌పై దాడికి యత్నించారు. సుప్రీంకోర్టు ఆవరణలో సిజెఐ గవాయ్‌పై లాయర్ కిషోర్ రాకేష్ చెప్పు విసిరేందుకు ప్రయత్నించాడు. కిషోర్ ను తొటి లాయర్లు అడ్డుకున్నారు. ఓ కేసు విచారణ సమయంలో సిజెఐపై లాయర్ కిషోర్ చెప్పు విసిరాడు. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ కిషోర్ నినాదాలు చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని సిజెఐ గవాయ్ తెలిపారు.