ఢిల్లీ: స్నేహం పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఎంబిబిఎస్ విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం చేసి అనంతరం వీడియో రికార్డు చేశాడు. దీంతో అతడిపై ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మెడికో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన ఓ ఎంబిబిఎస్ విద్యార్థిని ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ ప్రాంతంలో డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. అమన్‌ప్రీత్ అనే యువకుడు మాయమాటలతో యువతికి పరిచయమయ్యాడు. పరిచయం కాస్త చనువుగా మారడంతో స్నేహం పేరుతో ఆపిల్ హోటల్ కు తీసుకెళ్లాడు. హోటల్ రూమ్‌లో ఆమెపై అత్యాచారం చేసి వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేయడంతో తనతో కలిసి ఉండాలని బలవంతం చేస్తున్నాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.