హైదరాబాద్: నటుడు విజయ్ దేవరకొండతో రష్మిక మందానా నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో రష్మిక అనే యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె తన ఎక్స్‌లో ‘థామా’ సాంగ్ గురించి చెబుతూ పోస్టు చేశారు. దర్శక నిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలియజేశారు. ‘థామా’ సినిమా నుంచి ‘నువ్వు నా సొంతమా’ అనే సాంగ్ విడుదలైన సంగతి విధితమే. ఈ హాట్ సాంగ్‌లో రష్మిక తన అందం, డ్యాన్స్‌తో అదరగొట్టారు. అద్భుతమైన ప్రదేశం కావడంతో ఇక్కడ ఇలాంటి ఎందుకు చేయకూడదని దర్శక నిర్మాతలకు ఆలోచన వచ్చిందని రష్మిక తెలిపారు. దాదాపు 12 రోజులు కష్ట పడి పాటను షూటింగ్ చేశామన్నారు. లోకేషన్ తనకు కూడా నచ్చడంతో రెండు మూడు రోజులు రిహార్సిల్ చేసి పాటను పూర్తి చేశామన్నారు. పాట పూర్తి చేసిన తరువాత వీడియో చూసి ఆశ్చర్యపోయానని రష్మిక సంతోషం వ్యక్తం చేశారు. తాము ప్లాన్ చేసిన దానికంటే బాగా రావడంతో పాటలో భాగమైన సినిమా యూనిట్ సిబ్బంది అభినందనలు చెప్పారు. ప్రేక్షకులు థియేటర్‌లో ఈ పాటను ఎంజాయ్ చేస్తారని తాను ఆశించానన్నారు. థామా సినిమాలో రష్మికకు తోడుగా ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. ఈ సినిమాకు సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 21న విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్ని అతీంద్రియ శక్తులతో కూడిన రోమాంటిక్ చిత్రం కావడంతో దర్శక నిర్మాతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. రష్మిక నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.