పవన్‌కళ్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘ఒజి’. గత నెల 25న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. విదేశాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్ర దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్ కలిసి డాలస్ వెళ్లారు. ఓ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి వీరిద్దరు సినిమా చూశారు. అనంతరం కేక్ కట్ చేసి, సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత అభిమానులతో కలిసి ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ అభిమాని ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందా? ప్రీకెల్ రానుందా అని ప్రశ్నించారు. దీనికి రెండు వస్తాయని సుజీత్ సమాధానం ఇచ్చారు. అయితే ‘ఒజి’ ప్రీకెల్లో అకీరా నందన్ ఉంటారా? అనే ప్రశ్నకు.. దాని గురించి ఇప్పుడే చెబితే థ్రిల్ ఉండదని డైరెక్టర్ సుజీత్ అన్నారు.