రంగారెడ్డి: హిమాయత్‌సాగర్ వద్ద ఒఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై 6 కార్లు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న దారిలో ఈ ప్రమాదం జరిగింది. కార్లు ఢీకొనడంతో ఒఆర్ఆర్‌పై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పెట్రోలింగ్ సిబ్బంది ట్రాపిక్‌ని క్లియర్ చేస్తున్నారు. కార్లలోని ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.