లవ్‌టుడే, రిటర్న్ ఆఫ్ ధి డ్రాగన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు ప్రదీప్ రంగనాథన్. డబ్బింగ్ సినిమాలే అయినప్పటికీ.. తెలుగులోనూ ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రదీప్ చేస్తున్న చిత్రం ‘డ్యూడ్’. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘సింగారి చిన్నదాన’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. మ్యూజిక్‌తో అందించడంతో పాటు సాయి అభ్యంకర్ గానం చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తీశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన విడుదల కానుంది.