ఆస్ట్రేలియాతో పర్యటన కోసం భారత జట్టును బిసిసిఐ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మకు బదులుగా శుభ్‌మాన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాక.. ఈ రెండు సిరీస్‌లకు కామన్‌గా ఉన్న ప్లేయర్ హర్షిత్ రాణా. హర్షిత్‌కి ఇంతవరకూ పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం జట్టుతో ఉండేందుకే అన్నట్లు అతన్ని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హర్షిత్.. ప్రధాన కోచ్ గంభీర్ తాలుకా అని.. అందుకే అతని జట్టులో చోటు దొరుకుతుందని శ్రీకాంత్ విమర్శించారు.
‘‘హర్షిత్ రాణా భారత జట్టులో శాశ్వత ప్లేయర్. ఎందుకంటే అతడు గౌతమ్ గంభీర్‌కి ఇష్టమైన ఆటగాడు. అందుకే, జాబితాలో శుభ్‌మాన్ గిల్‌తో తర్వాత అతడి పేరే ఉంటుంది. హార్థిక్ పాండ్యాకు బదులుగా ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. అతడు మెరుగైన ప్రత్యమ్నాయం కాదని నా అభిప్రాయం. రవీంద్ర జడేజానే బెస్ట్ ఆల్ రౌండర్. నితీశ్‌ని బ్యాటర్‌గానే తీసుకోవాలి. బౌలింగ్ కూడా చాలా తక్కువగా వేస్తాడు. గత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడిని తీసుకోలేదు. వచ్చే ప్రపంచకప్ ప్లానింగ్‌లో అతడు ఉంటాడని అనుకోవడం లేదు’’ అని శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.