కొలంబో: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి, ప్రతీకలు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 48 పరుగులు జోడించారు. అయితే పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సన వేసిన 9వ ఓవర్ చివరి బంతికి స్మృతి(23) ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరింది. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజ్‌లో ప్రతీక(27), హర్లిన్ (6) ఉన్నారు.