అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఊర్మిళనగర్లో ఘోర దారుణం వెలుగులోకి వచ్చింది. బొమ్మసానినగర్ లో పిన్నిని అక్క కొడుకు ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని పగ పెంచుకున్నాడు. పిన్నిని ఇంటికి తీసుకెళ్లి కాళ్లు, చేతులు, తల నిందితుడు నరికేశాడు. మొండెం, తల వేరు చేసి శరీర భాగాలను గోనె సంచుల్లో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురికి కాల్వల్లో దుర్మార్గుడు పడేశాడు. మైనర్ అయిన తన కొడుకుతో కలిసి దారుణానికి నిందితుడు ఒడిగట్టాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి ి మైనర్ తో పాటు తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.