వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడమే అసాధ్యం. అలాంటి రికార్డును ఇప్పటికే పలువురు క్రికెటర్లు సాధించారు. కానీ, వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ అంటే.. అది అనితర సాధ్యమైనది. అలాంటి రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువ క్రికెటర్ సాధించాడు. అయితే అది అంతర్జాతీయ వన్డేల్లో కాదు.. దేశవాళీ క్రికెట్‌లో. ఆస్ట్రేలియాకు చెందిన హర్జాస్ సింగ్.. సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో 300+ పరుగులు స్కోర్ సాధించాడు. ఈ ఫీట్‌ని అతడు 135 బంతుల్లోనే అందుకున్నాడు. అందులో 35 సిక్సులు ఉండటం గమనార్హం.
వెస్ట్రర్న్ సబర్బ్స్ జట్టు తరఫున ఆడుతున్న హర్జాస్ సిడ్నీ ఫస్ట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 308 పరుగులు చేశాడు. సిడ్నీకి చెందిన ఇద్దరు బౌలర్లు తమ కోటా బౌలింగ్‌లో 100+ పరుగులు సమర్పించుకున్నారు. ఇక ముల్లెన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో హర్జాస్ సిక్సుల వర్షం కురిపించాడు. దీంతో హర్జాస్ జట్టు ఏకంగా 474 పరుగుల స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో సిడ్నీ విఫలమైంది. కేవలం 287 పరుగులకే పరిమితమైంది. దీంతో వెస్టర్న్ సబర్బ్స్ జట్టు 187 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా హర్జాస్ నిలిచాడు. గతంలో న్యూసౌత్ ప్రీమియర్ ఫస్ట్ గ్రేడ్ క్రికెట్ చరిత్రలో విక్టర్ ట్రంపర్ (1903), ఫిల్ జాక్వెస్ (2007)లో ఈ రికార్డు సాధించారు. విక్టర్ 335, ఫిల్ 321 పరుగులు చేశాడు. కాగా, హర్జాస్ పూర్వీకులు భారత్‌కు చెందిన వారే. చాలా సంవత్సరాలుగా వాళ్లు ఆస్ట్రేలియాలో అతడి కుటుంబం స్థిరపడింది.