అమరావతి: అర్థరాత్రి అల్లుడిని పెళ్లి చేసుకుంటుండగా కూతురు అడ్డు రావడంతో ఆమెను కన్నతల్లి చంపడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా కెవిబిపురం మండలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రామంలో 18 ఏళ్ల బాలుడు, 15 ఏళ్ల బాలిక గాఢంగా ప్రేమించుకున్నారు. ఐదు నెలల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలిక తండ్రి చనిపోవడంతో తన కూతురుతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో అల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. శుక్రవారం రాత్రి భార్య ఎదుట అల్లుడితో అత్త తాళ్లి కట్టించుకుంటుండగా కూతురు ఆపింది. అల్లుడితో కలిసి అత్త తన కూతురుపై దాడికి పాల్పడింది. రోకలి బండతో తలపై మోదడంతో ఆమె కేకలు విని స్థానికులు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. అత్త, అల్లుడుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారిని చితకబాది చేసి పోలీసులకు అప్పగించారు.