మనతెలంగాణ/ సిటీబ్యూరో/మాదాపూర్ : ఆక్రమణల చెర నుండి రూ. 3600 కోట్లు విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రా జీలేకుండా.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, హై కార్టు తీర్పు మేరకు ప్రభుత్వ భూమిలోని ఆక్రమణ లు, అక్రమనిర్మాణాలను హైడ్రా శనివారం ఉద యం నేలమట్టం చేసింది. ప్రభుత్వ భూమిలో ఉం టూ యదేచ్చగా వ్యాపారం చేసుకుంటున్నారని హైడ్రా గుర్తించింది. వేల కోట్ల భూమిని కాజేసే క్ర మంలో కొందరు పేదలు ఉండేలా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రా నిర్థారించుకున్న అనంతరం చర్యలు తీసుకుందని అధికారులు స్పష్టంచేశారు. తాము రైతులమని, కుటుంబ నియంత్రణ చేసుకున్నందుకు అప్పట్లో ప్రభుత్వమే తమకు భూమిని కేటాయించిందని నివాసితులు ఆవేదన వ్యక్తంచేశారు. అయినా.. హైడ్రా.. ఖాతరు చేయకుండా వారు తాత్కాలికంగా ఏర్పాటుచేసుకున్నవి, ఇతర నిర్మాణాలను తొలగించి ఫెన్సింగ్ వేసి, బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.
36 ఎకరాలు.. రూ. 3600 కోట్లు..
శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామం పరిధిలోని భిక్షపతినగర్‌లోని సర్వే నెంబర్ 59లో 36 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 12 మంది దళిత రైతులు ఉంటున్నారు. హైడ్రా అధికారులు మాత్రం.. ప్రభుత్వం పక్షాన హైకోర్టు తీర్వు ఇచ్చినట్టు వెల్లడిస్తున్నారు. దీంతో హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్త్ మధ్య సర్వే భిక్షపతినగర్ సర్వే నెంబర్ 59లోని 36 ఎకరాల భుమిలో ఉన్న 5 తాత్కాలిక నిర్మాణాలను జెసిబిల సహయంతో పూర్తిగా తొలగించారు. తర్వాత కంచెవేయడం, బోర్డులు నాటడం జరిగిందని హైడ్రా తెలిపింది.
మా తాతల భూమి..
రైతు కుటుంబాలు తమ పిల్లలతో కూల్చివేతల ప్రదేశానికి చేరుకుని.. ఈ భూమి మా తాతలకు, తండ్రులకు ఇందిరా గాంధీ హయం 1960లో కుటుంబ నియంత్ర ఆపరేషన్ చేసుకున్న 12 మంది రైతులకు 36 ఎకరాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి తామంత ఇక్కడే పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. మా వద్ద భూమి పట్టాలు ఉన్నాయని చెప్పారు. ఈ భూమికి సంబంధించి పన్నులు చెల్లించడం జరుగుతుందన్నారు. భూమిపై తమకు పూర్తి హక్కు ఉందన్నారు. ఇక్కడ భూమికి మంచి డిమాండ్ ఉండి, ఎకరం 100 కోట్ల వరకు పలుకుతుండటంతో పెద్ద వారి కన్ను పడిందంటున్నారు. హైడ్రా అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉదయం 4 గంటలకు భారీ పోలీస్ బందోబస్త్ మధ్య మా గుడిసెలను పూర్తి తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ప్రభుత్వ భూమి అని ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. భూమి హక్కుదారులమైన మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చి వేతలు ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఉన్నట్టుండి, నోటీసులు జారీచేయకుండా కూల్చివేతలు చేస్తే మేము ఎక్కడికి వెల్లాలని స్రభుత్వం మాకు న్యాయం చేయాలని కొరారు.
కుటుంబ నియంత్రణకు.. పట్టాలు….
1960లో అప్పటి కాంగ్రెస్ సారధి ఇందిరా గాంధీ హయంలో ప్రభుత్వం పట్టాలను ఇచ్చిందని బాధితులు తెలిపారు. గత 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మమ్ములను ఇక్కడి నుండి ఎలాగైనా ఖాళీ చేయించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఖాళీ చేయించే కుట్ర చేస్తుందని బాధితులు ఆరోపించారు. 2000 సంవత్సరంలో ఈ భూముల యాజమానులవేనని నిర్దారించి జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయినప్పటికి ప్రభుత్వం పదే పదే హై కోర్టును ఆశ్రయించి భూములు ప్రభుత్వానికి చెందినవని పిటిషన్‌లో తెలిపిందన్నారు. గత నాలుగు వారం రోజుల క్రితం హై కోర్టు అందులో నివాసం ఉంటున్న రైతు యాజమానులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిందన్నారు. భౌండరీలు నిర్దారించకుండానే స్థలం చుట్టు ఫెన్సింగ్ వేసేందుకు పైపులను ఏర్పాటు చేస్తుందన్నారు. తమ భుములు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు.