కొనుగోలుదారుల కోసం టిజి రెరా మొబైల్ యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోట ర్లు, కొనుగోలుదారులకు మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (టీజీ రెరా) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిం ది. ఇందులో భాగంగా టిజి రెరా కార్యాలయంలో కియోస్క్‌లను ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులు ప్రాథమిక సేవలను నేరుగా కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా పొందగలిగే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది బయట ప్రతి ఒక్కరికీ కనపడేలా ప్రదర్శించాలని, అందుకు బిల్డర్లు, డెవలపర్లు చర్యలు తీసుకునేలా మార్గ దర్శకాలు రూ పొందించనున్నారు. వినియోగదారులు ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కా న్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ డెవలపర్, ప్రమోటర్, అపార్ట్‌మెంట్ల సంఖ్య, అనుమతులు వంటి పూర్తి సమాచారాన్ని తక్షణమే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దీంతోపాటు మొ బైల్ యాప్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకు రానుంది. మహారాష్ట్రలోని మహారెరా ఆధ్వర్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 2023లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసింది. దీంతో ప్రాజెక్టు డెవలపర్లు ప్రమోషన్, అడ్వర్టైజ్‌మెంట్ సమయంలో క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా పబ్లిష్ చేయాలని నిర్ణయించింది. అక్కడ విజయవంతంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
పారదర్శకంగా సేవలు
గృహ కొనుగోలుదారులతో పాటుగా పెట్టుబడిదారులు సులభంగా, వేగంగా, పారదర్శకంగా సేవ లు పొందేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని రెరా నిర్ణయించింది. అందులో భాగంగా రెరా కార్యాలయంలో కియోస్క్‌లను ఏ ర్పాటు చేయాలని నిర్ణయించింది. వినియోగదారు లు ప్రాథమిక సేవలను నేరుగా కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా పొందగలిగే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కియోస్క్‌లు చిన్న బ్యాంక్ ఔట్‌లెట్ల మాదిరిగా పని చే స్తాయి. వినియోగదారులు ప్రాజెక్ట్ సమాచా రం, ఫిర్యాదులు, నమోదు వివరాలు, ఏజెంట్, మధ్యవర్తుల సమాచారం వంటి సేవలను కియో స్క్ ద్వారా పొందడానికి అవకాశముందని టీజీరెరా అధికారులు చెబుతున్నారు. బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లు, కొనుగోలుదారులకు మెరుగై న సేవలందించేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (టీజీ రెరా) లో పబ్లిక్ గ్రీవెన్స్, గైడెన్స్‌సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ధృవపత్రాలు, ఉండాల్సిన అర్హతలు, ఇతర వివరాలను సెల్ వివరించనుంది. దీంతోపాటు ప్రమోటర్లకు ఉండాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించనుంది. ము ఖ్యంగా కొనుగోలు దారులకు సంబంధించిన ఫి ర్యాదులు, సందేహాలు, అనుమానాలను సైతం ని వృత్తి చేయనుంది. అయితే సెల్ ఏర్పాటుకు సం బంధించి రెరా ఎక్స్ ఫ్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈఓఐ) ద్వారా నోటిఫికేషన్ జారీచేసింది. దీని కోసం మూడు ఏజెన్సీలు ముందుకువచ్చాయి. వీరిలో ఒక ఏజెన్సీని ఫైనల్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నా రు. ఈ కియోస్క్‌లు చిన్న బ్యాంక్ అవుట్‌లెట్ల మాదిరిగా పని చేస్తాయి. వినియోగదారులు ప్రాజెక్ట్ స మాచారం, ఫిర్యాదులు, నమోదు వివరాలు, ఏజెంట్/మధ్యవర్తుల సమాచారం వంటి సేవలను కియోస్క్ ద్వారా పొందగలరరి అధికారులు తెలిపారు. ఈ కియోస్క్‌ల ఏర్పాటు ద్వారా దేశం లో తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.