అలనాటి మేటి నటి సంధ్య శాంతారామ్ శనివారం ముంబైలో కన్నుమూశారు. చలనచిత్ర దిగ్గజం శాంతారామ్ భార్య అయిన సంధ్యారాణి జనక్‌జనక్ పాయల్‌బాజే , దో ఆంఖే బారాహాత్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆమె ప్రధాన భూమికల్లో నటించారు. జీవించారు. పింజారా చిత్రం ఆమె నటనకు వన్నె తెచ్చింది. 87 సంవత్సరాల సంధ్యాశాంతారామ్ హీరోయిన్ సంధ్య గా సుపరిచితులు. 1938 సెప్టెంబర్‌లో కొచ్చిలో జన్మించిన సంధ్యకు దర్శకులు వి శాంతారామ్ తమ చిత్ర అమర్ భూపాలీలో 1951లో అవకాశం ఇచ్చారు. 1956లో ఆమె శాంతారామ్‌ను పెళ్లాడారు. పలు హిందీ మరాఠా సినిమాలలో నటించిన సంధ్య నటనతో పాటు అత్యుత్తమ నాట్యకళాకారిణిగా పేరొందారు. వవరంగ్ వంటి పలు , సినిమాలో అత్యద్భుత నటన ప్రదర్శించారని చిత్ర ప్రముఖులు నివాళులతో కూడిన ప్రశంసలు కురిపించారు.