బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్‌దేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆరోపించారు. ఎల్‌బినగర్ నియోజకవర్గం, కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని పార్టీ ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ…కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్ల గడిచినా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన టిమ్స్ ఆసుపత్రుల పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. కెసిఆర్ ప్రారంభించిన బస్తీ దవాఖానాలు మూతపడాలన్నేదే రేవంత్ లక్షమని విమర్శించారు. రాజకీయాల కోసం ఆసుపత్రుల నిర్మాణం ఆపొద్దని హితవు పలికారు. వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రులను యుద్ధాప్రతిపదికన పూర్తి చేయాలని. లేకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి పుణ్యమా అని ఆసుపత్రులలో ఉద్యోగులకు గత ఆరు నెలలు నుంచి జీతాలు లేవని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట్, కుత్బుల్లాపూర్, సంగారెడ్డి ఎంఎల్‌ఎలు కాలేరు వెంకటేష్‌గౌడ్, వివేకానందగౌడ్, చింతా ప్రభాక, ఎల్‌బినగర్ నియోజకవర్గం మాజీ కొర్పొరేటర్లు పాల్గొన్నారు.