అమరావతి: సాంకేతికతను పేద ప్రజల కోసం ఉపయోగిస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టిస్తున్నామని అందరికీ అందిస్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిఎస్టి-02 ద్వారా సూపర్ సేవింగ్స్, దసరా, దీపావళి, సూపర్ సిక్స్, సూపర్ జిఎస్టి అని జిఎస్టి సంస్కరణల ద్వారా ధరలు బాగా తగ్గిపోతున్నాయని తెలియజేశారు. గత ఐదేళ్ల విధ్వంసం తన జీవితంలో చూడలేదని, దుర్మార్గులు రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. దుష్ట శక్తులు రాకుండా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, యూనివర్శల్ హెల్త్ ఇన్సూరెన్స్ తో అందరినీ ఆదుకుంటామని చెప్పారు. పేదల ఆరోగ్యాన్నికాపాడే బాధ్యత తీసుకుంటున్నామని సిఎం పేర్కొన్నారు. రూ. 25 లక్షల వరకు హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మంచి చేయడమే తన పని అని అన్నారు. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 750 సేవలు నేరుగా అందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.