అహ్మదాబాద్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో కరేబియన్ సట్టు తోలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలిపోయింది. వెస్టిండీస్ బ్యాటింగ్‌లె భారత బౌలింగ్‌లో సిరాజ్ 4, బుమ్రా 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు రాణించారు. రాహుల్ (100), ధృవ్(125), జడేజా (105) సెంచరీలతో చెలరేగాడు.
ఈ క్రమంలో భారత్ 448/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దీంతో వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బ్యాటింగ్‌లో గ్రీవ్స్ చేసిన 25 పరుగులే అత్యధికం. ఇక భారత బౌలింగ్‌లో జడేజా 4, సిరాజ్ 3, కుల్దీప్ 2, సుందర్ 1 వికెట్లు తీశారు. దీంతో భారత్ ఒక ఇన్నింగ్స్‌తో పాటు 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.