హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లోతుకుంటలో ఓ షాపులో మంటలు చెలరేగి పక్కనున్న 8 షట్టర్లకు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్య్కూటే ఈ ప్రమాదానికి కారణమని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.