హైదరాబాద్: టిమ్స్ నిర్మాణ పనులను సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ నత్తనడకన సాగుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గతంలో కొత్తపేట టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని మాజీ సిఎం కెసిఆర్ తలపెట్టారని అన్నారు. ప్రజా ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కార్ లో ఆర్యోగ్యశ్రీ ఆస్పత్రులకు బకాయిలు పెట్టారని మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే.. ఈ పాటికే టిమ్స్ పూర్తయ్యేదని అన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచించారు. కెసిఆర్ తీసుకొచ్చిన మంచి పనులు ఆపాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆర్నెళ్లలోపు ఆస్పత్రులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హరీశ్ రావు డిమాండ్ చేశారు.