ఢిల్లీ: బిహార్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం అని భారత ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు. జిఎస్టి తగ్గింపు వల్ల బిహార్ యువతకు ఈ సారి డబుల్ బొనాంజా వచ్చిందని అన్నారు. బిహార్ యువతకు విజ్ఞాన్ భవన్ లో పిఎం- సేతు పథకం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో మోడి మీడియాతో మాట్లాడుతూ.. విద్యా, నైపుణ్యాభివృద్ధికి పథకం తోడ్పడుతుందని, బిహార్ లోని 19 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఆత్మ నిర్భర్ భారత్, ఉపాధి అవకాశాలు దక్కాలంటే నైపుణ్యాలు కావాలని నరేంద్ర మోడి పేర్కొన్నారు.