ఛండీగఢ్: పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ప్రియుడు షేర్ చేశాడు. దీంతో ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిపై పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం పానిపట్టులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కునాల్(25) అనే యువకుడు కోమల్ అనే యువతిని గాఢంగా ప్రేమించాడు. కోమల్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా 2024 జూన్ 26న కోమల్ ను కునాల్ వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల తరువాత కోమల్ తన భర్తను వదిలేసి అమ్మగారింటికి వచ్చింది. భరణం కావాలని కోమల్ కోర్టును ఆశ్రయించింది. తన నెలకు రూ.30 వేల కావాలని డిమాండ్ చేసింది. తనకు 12 వేల శాలరీ వస్తుందని, అంత డబ్బు ఇవ్వలేనని తెగేసి చెప్పాడు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో కునాల్ షేర్ చేశాడు. ఫొటోలను తొలగించాలని యువతి కుటుంబ సభ్యులు యువకుడితో గొడవకు దిగారు. సెప్టెంబర్ 24న కునాల్ తన తండ్రితో కలిసి వెళ్తుండగా ఆమె తండ్రి సతీష్, మామ రాకేష్, ఇద్దరు సోదరు పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండు కాళ్లు, చేతులు విరిగిపోయానని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.