హైదరాబాద్: హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు జరిగాయి. కొండాపూర్ భిక్షపతినగర్ లోని 36 ఎకరాల్లో నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్ లో సర్వే నెంబర్ 59 లో భూములు ఉన్నాయి. అధికారులు మొత్తం రూ.3,600 కోట్ల విలువైన ఆస్తులని చెబుతున్నారు. రైతులు 60ఏళ్లుగా తమ ఆధీనంతోనే భూములున్నాయంటున్నారని తెలియజేశారు.