శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నటుడు శివాజీ నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటి లయ ముఖ్య పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. శివాజీ ప్రొడక్షన్ హౌస్‌లో రానున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈటీవీ విన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ నుంచి దసరా స్పెషల్‌గా నటి లయ పోషించిన పాత్రకు సంబంధించిన పరిచయాన్ని చేశారు. లయ ఈ చిత్రంలో ఉత్తర అనే గృహిణి పాత్రను పోషిస్తున్నారు. పైకి ఒకలా.. లోపల ఇంకోలా ఎమోషన్స్‌ను దాచుకునే ఈ పాత్రలో లయ చాలా కొత్తగా, డిఫరెంట్ గా కనిపించబోతోన్నారని పోస్టర్‌ను చూస్తేనే తెలుస్తోంది.