రంగారెడ్డి: ప్రేమపెళ్లి చేసుకున్న ఆరు నెలలకే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహాంపట్నం మండలం ఎర్దండిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడ్డెర కాలనీలో సంతోష్(25), గంగోత్రి(22) అనే యువతి, యువకుడు ఉండేవారు. ఇద్దరు మధ్య ప్రేమ చిగురించడంతో పెద్దలను ఒప్పించి ప్రే పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 2న గంగోత్రి తన భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరు మధ్య ఘర్షణ తారాస్థాయిలో జరిగింది. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఇంట్లోకి వెళ్లి గంగోత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింట్లో గొడవలు జరగడంతో తన కూతరు ఆత్మహత్య చేసుకుందని తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.