భోపాల్: ఓ ఇంట్లోని నీటి డ్రమ్ములో ఓ యువతి మృతదేహం కనిపించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లక్షిత చౌదరి అనే యువతి కాలేజీ వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తుండగా తానే లక్షితను చంపేశానని మోను అనే యువకుడు లొంగిపోయాడు. లక్షితను గాఢంగా ప్రేమించానని, ఆమె మరో యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తుండడంతో హత్య చేశానని వివరించారు. లక్షిత కాళ్లు చేతులు కట్టేసి అనంతరం నీటి డ్రమ్ములో ముంచి చంపేశానని చెప్పాడు. నీటి డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం దేవాస్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.