మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలంగాణలో పె ద్ద పండుగ అయిన దసరా పండుగ రావడంతో గ్రామాల్లో ఆశావహులు ధూమ్‌ధాంగా విజయదశ మి నిర్వహించారు. చాలా ప్రాంతాలలో అభ్యర్థు లు తమ అనుచరులతోపాటు వివిధ సంఘాల ప్ర తినిధులకు మంచి దావత్‌లు ఏర్పాటు చేశారు. ప్ర స్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల ఖర్చు తడిచి మో పెడు అవుతోంది. అసలే దసరా ముందు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆశావహులు త మ అనుచరులు, వివిధ వర్గాల నేతలకు దావత్‌లు ఇచ్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో బరిలో ఉండే అభ్యర్థి పేరు ఖరారు కాక ముందే ఆశావహులు రాజకీయ వేడిని రాజేస్తున్నా రు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, తాజా మాజీ నాయకులు తమ అనుచరుల తో పాటు వివిధ సంఘాల నేతలను, ఓటర్లను క లుస్తూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. స్థానికులై దూర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను ఫోన్లలో సంప్రదించి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తన కు మద్దతు తెలుపాలని ముందస్తుగా వేడుకుంటున్నారు.
కొందరైతే ఎంత ఖర్చయినా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని పూర్తి శక్తియుక్తులు ఒడ్డుతున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రధాన రాజకీ య పార్టీలు తమదైన వ్యూహాలతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండడమే కీలకమని భావిస్తున్న పార్టీలు పంచాయతీ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా యి. క్షేత్రస్థాయిలో తమ పార్టీపై ఇతర పార్టీ నేత లు చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందిస్తూనే ప్ర త్యర్థి పార్టీలపై నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన నేతల ఘాటైన విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ, సన్నబియ్యం, ఉచిత బస్సు వంటి పథకాలను కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా, హామీల అమలులో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమయ్యిందంటూ పేర్కొంటూ బాకీ కార్డు పేరిట బిఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళుతోంది. కేంద్రంలో ఉన్న కమలం పార్టీ, రాష్ట్రంలోనూ అధికారంలోకి రాబోయేది తమ పార్టీనే అని భరోసా కల్పిస్తూ సామాన్య, మధ్యతరగతి ప్ర జలకు ఊరట కలిగిచే జిఎస్‌టి తగ్గింపును ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకుని ప్రజల్లోకి వెళుతూ క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేస్తుంది.
ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పార్టీలు
పంచాయతీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి.జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధం గా ఆయా పార్టీల నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీటితోపాటు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పు డు చేరవేస్తున్నారు. ఇతర రాష్ట్రాల పార్టీ కార్యాలయాలలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి అందులో మెరుగైన విధానాలను తమ పార్టీలో అవలంభించనునున్నారు. ఆయా పార్టీల వ్యవహారాలలో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానాలను సమీక్షించుకుని అవసరమైన అంశాలలో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ప్రధానంగా మూసపద్దతికి స్వస్తి పలికి ఆధునిక విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
గ్రామాల్లో ఊపందుకున్న రాజకీయం
గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకుంది. రాష్ట్ర స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో స్థానిక నాయకులు అప్పుడే బరిలోకి దిగారు. సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకవైపు ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నాయకులు, యువకులు చొరవ చూపుతున్నారు.
మరోవైపు గ్రామం లో ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి యువత ఉత్సహం చూపుతోంది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆ యా పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, ఏ పార్టీ లో సభ్యత్వం లేని వారు కూడా ఆయా పార్టీల మ ద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు.