రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మరోసారి మోసం చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం దసరా పండుగ లోగా ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం కళాశాలల యజమాన్యాలకు హామీ ఇచ్చిందని ఆయన శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు దీపావళి లోగా రెండో విడత ఎలా విడుదల చేయగలదన్న అనుమానాలు యజమాన్యాలు వ్యక్తం చేస్తున్నాయని ఆయన తెలిపారు. అందుకే కళాశాలల యజమాన్యాలు ఈ నెల పదమూడు నుంచి సమ్మెకు దిగాలని సంకల్పించాలయని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.