అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధృవ్ జురేల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. రిషబ్ పంత్‌కి గాయం కావడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన జురేల్ తన సత్తా నిరూపించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో తన కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. 194 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 104 పరుగులు చేసి శతకం సాధించాడు.
ఇక మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ వికెట్ తర్వాత జురేల్, రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యన్ని జత చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కి 176+ పరుగులు జోడించారు. జడేజా కూడా 145 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సులతో 86 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 118 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ 236 పరుగుల ఆధిక్యంలో ఉంది.