అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డున అమరావతిలో దారుణం వెలుగులోకి వచ్చింది. విజయవాడలో తెలంగాణ మహిళను వేధింపులకు గురి చేశారు. దుర్గాదేవి దర్శనం కోసం వచ్చిన మహిళ నగ్న వీడియోలను ఇద్దరు యువకులు చిత్రీకరించారు. ఈ సంఘటన విజయవాడలోని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గవర్నర్ పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తుండగా మహిళను పక్క రూంలో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకులను బాధితురాలు గుర్తించింది. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.