అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. అద్భుతమైన సెంచరీ సాధించాడు. అయితే ఆ సెంచరీని మరింత పెద్ద స్కోర్‌గా మలుచుకోవడంలో రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. సెంచరీ చేసిన కొద్ది సమయంలోనే ఔట్ అయ్యాడు. 197 బంతులు ఎదురుకున్న రాహుల్ 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి వారికన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ భారత బౌలింగ్‌ను తట్టుకొని నిలబడలేకపోయింది. 44.1 ఓవర్లో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 36 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన సాయి సుదర్శన్ నిరాశ పరిచాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, కెఎల్ రాహుల్‌లు కలిసి మూడో వికెట్‌కి 98 పరుగల భాగస్వామ్యం జత చేశారు. అర్థ శతకం చేసి గిల్(50) రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ శతకం సాధించి వెనుదిరిగాడు. ప్రస్తుతం 76 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసి 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో ధృవ్ జురేల్ (26), రవీంద్ర జడేజా (21) ఉన్నారు.