అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో దేవళం పేట ప్రధాన కూడలి లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు, దళితులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్థానిక సర్పంచ్ చొక్కా గోవిందయ్య హెచ్చరించారు.