అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో చెన్నకేశవ స్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కందనాతి చెన్నకేశవ స్వామి రథాన్ని కొండపైకి తీసుకెళ్తుండగా పక్కకి ఒరిగి భక్తుల మీద పడింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.