హీరో నాగశౌర్య నటిస్తున్న అవుట్ అం డ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడిగా విధి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యా నర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ నా మావ పిల్లనిత్తానన్నాడే సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ అమెరికా నుండి వచ్చాను పాటని రిలీజ్ చేశారు. హారిస్ జయరాజ్ ఈ సాంగ్‌ని ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కం పోజ్ చేశారు. చంద్రబోస్ రాసిన సాహిత్యం మాస్‌ని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో స ముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.