అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 38 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. యశస్వి జైస్వాల్ 36 పరుగులు చేసి జయ్‌డెన్ సీల్స్ బౌలింగ్‌లో శాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ ఏడు పరుగులు చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్ (53), శుభ్‌మన్ గిల్(18) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వెస్టిండీస్ 44.1 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ ఇంకా 41 పరుగుల ఆధిక్యంలో ఉంది.