హైదరాబాద్: ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాల తర్వాత హీరో సాయి దుర్గ తేజ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ప్రస్తుతం అతను చేస్తున్న చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’. రోహిత్ కెపి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో సినిమా చూడాలనే ఉత్సాహం నెలకొంది. అయితే చిత్ర యూనిట్ నుంచి అంతగా అప్‌డేట్స్ ఏమీ రాలేదు. అయితే దసరా పండగ సందర్భంగా గురువారం సినిమా ప్రీ గ్లింప్స్‌ని విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నట్లు ఇందులో ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు నిర్మిస్తున్నారు. అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.